లౌడ్‌స్పీకర్లపై కేంద్రం చట్టం చేయాలి: మహా ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-04-25T21:36:59+05:30 IST

లౌడ్‌స్పీకర్లపై దేశం మొత్తానికి వర్తించేలా ఒక చట్టం చేయాలని మేము విజ్ణప్తి చేస్తాన్నాం. ఇలాంటి చట్టం వస్తే మహారాష్ట్రలో తలెత్తిన ఇబ్బందులు దేశంలో ఎక్కడా తలెత్తకుండా చూడవచ్చు. ఈ విషయమై అవసరమైతే రాష్ట్రం నుంచి ఒక బృందాన్ని పంపించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపించాలని ఈ రోజు సమావేశంలో నిర్ణయించాం..

లౌడ్‌స్పీకర్లపై కేంద్రం చట్టం చేయాలి: మహా ప్రభుత్వం

ముంబై: మత ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్ల విషయమై కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ణప్తి చేసింది. సోమవారం మహా హోంమంత్రి దిలిప్ వాల్సే పాటిల్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘లౌడ్‌స్పీకర్లపై దేశం మొత్తానికి వర్తించేలా ఒక చట్టం చేయాలని మేము విజ్ణప్తి చేస్తాన్నాం. ఇలాంటి చట్టం వస్తే మహారాష్ట్రలో తలెత్తిన ఇబ్బందులు దేశంలో ఎక్కడా తలెత్తకుండా చూడవచ్చు. ఈ విషయమై అవసరమైతే రాష్ట్రం నుంచి ఒక బృందాన్ని పంపించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపించాలని ఈ రోజు సమావేశంలో నిర్ణయించాం’’ అని అన్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే లేవనెత్తిన ఈ వివాదం కొద్ది రోజులుగా మహారాష్ట్రను కుదిపివేస్తోంది. మహారాష్ట్రలో మే 3 వరకు మసీదుల వద్ద లౌడ్‌స్పీకర్ల నుంచి శబ్దం రాకుండా ఆపేయాలని, అలా జరగని పక్షంలో తర్వాత చేసేది చేస్తామని రాజ్ థాకరే ఇప్పటికే హెచ్చరించారు.

Updated Date - 2022-04-25T21:36:59+05:30 IST