అందరికీ బూస్టర్ డోస్.. పరిశీలిస్తున్న కేంద్రం

ABN , First Publish Date - 2022-03-21T21:42:40+05:30 IST

అనేక దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది.

అందరికీ బూస్టర్ డోస్.. పరిశీలిస్తున్న కేంద్రం

అనేక దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించింది. పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అర్హత కలిగిన వారందరికీ దాదాపుగా ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. మొత్తం 180 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ పూర్తైంది. వీరిలో కొందరికి ఇప్పటికే బూస్టర్ డోస్‌లు కూడా ఇచ్చారు. 60 ఏళ్లు పైబడిన వాళ్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు కలిపి 2.17 కోట్లకుపైగా బూస్టర్ డోస్‌లు పూర్తయ్యాయి. అయితే, ప్రస్తుతం ఇతర దేశాల్లో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండటంతో, అందరికీ బూస్టర్ డోసులు ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలా? లేదా ధర నిర్ణయించాలా? అనే అంశంపై చర్చిస్తోంది. మరోవైపు అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో బూస్టర్ డోస్‌లు కూడా పూర్తయ్యాయి. రెండో బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఆ దేశాలు రెడీ అవుతున్నాయి.

Updated Date - 2022-03-21T21:42:40+05:30 IST