‘మళ్లీ వైరస్‌’ సమాచార సేకరణ!

ABN , First Publish Date - 2020-09-21T08:46:50+05:30 IST

కొవిడ్‌ బారిన పడి కోలుకున్న వారికి మళ్లీ వైరస్‌ సోకుతోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటి కేసుల సమాచారాన్ని సేకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ యోచిస్తోంది....

‘మళ్లీ వైరస్‌’ సమాచార సేకరణ!

  • రీ ఇన్‌ఫెక్షన్‌ కేసులపై కేంద్రం యోచన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: కొవిడ్‌ బారిన పడి కోలుకున్న వారికి మళ్లీ వైరస్‌ సోకుతోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అలాంటి కేసుల సమాచారాన్ని సేకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ యోచిస్తోంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, ఢిల్లీ, మహారాష్ట్రల్లో రీ ఇన్‌ఫెక్షన్‌ కేసులు వెలుగుచూస్తున్న క్రమంలో కేంద్రం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ కేసులు నిజంగా రెండోసారి వైరస్‌ సోకినవా లేక మొదటిసారి వైరస్‌ వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావమా అన్నది తేల్చాల్సి ఉందని.. అందుకే సమాచారం సేకరించాలని యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొవిడ్‌-19 రీ ఇన్‌ఫెక్షన్‌ అనుమానిత కేసుల వివరాలను సేకరించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అనుమానిత కేసుల సమాచార నిర్వహణపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసే అవకాశం ఉందని తెలిపాయి.  


Updated Date - 2020-09-21T08:46:50+05:30 IST