వస్తోంది బోయింగ్‌ 777

ABN , First Publish Date - 2020-08-15T08:33:29+05:30 IST

బోయింగ్‌ నుంచి బీ777 విమానాన్ని తీసుకోవడానికిగాను ఎయిర్‌ ఇండి యా, కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు అమెరికాకు వెళ్లారు. వీవీఐపీల ప్రయాణానికి అనుగుణంగా ఈ విమానంలో మార్పులు చేర్పులు చేశారు...

వస్తోంది బోయింగ్‌ 777

న్యూఢిల్లీ, ఆగస్టు 14: బోయింగ్‌ నుంచి బీ777 విమానాన్ని తీసుకోవడానికిగాను ఎయిర్‌ ఇండి యా, కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు అమెరికాకు వెళ్లారు. వీవీఐపీల ప్రయాణానికి అనుగుణంగా ఈ విమానంలో మార్పులు చేర్పులు చేశారు. ఈ విమానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర అత్యున్నత స్థాయి ప్రముఖుల ప్రయాణాల కోసం వినియోగించనున్నారు. మరో కస్టమ్‌ మేడ్‌ బీ777 విమానాన్ని వచ్చే సెప్టెంబరులో బోయింగ్‌ నుంచి తీసుకోనున్నట్టు ఎయిర్‌ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఈ విమానాలు జూలైలోనే డెలివరీ కావాల్సి ఉంది. అయుతే కొవిడ్‌-19 కారణంగా ఆలస్యమైంది. ఈ రెండు బీ777 విమానాలను ఎయిర్‌ ఇం డియా పైలట్లు కాకుండా భారత వాయు సేన పైలట్లు నడపనున్నారు. బీ777 విమానాల్లో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలుంటాయి.

Updated Date - 2020-08-15T08:33:29+05:30 IST