రాష్ట్రాలకు రూ.13,300 కోట్ల బొనాంజా

ABN , First Publish Date - 2020-05-23T08:46:33+05:30 IST

రాష్ట్రాలకు అదనపు నిధులు అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలపై మార్కెట్‌ బకాయి ల చెల్లింపుల ఒత్తిడిని తగ్గించేందుకు కన్సాలిడేటెడ్‌ సింకింగ్‌ ఫండ్...

రాష్ట్రాలకు రూ.13,300 కోట్ల బొనాంజా

  • సీఎ్‌సఎఫ్‌ విత్‌డ్రాయల్‌ నిబంధన సడలింపు 


ముంబై: రాష్ట్రాలకు అదనపు నిధులు అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలపై మార్కెట్‌ బకాయి ల చెల్లింపుల ఒత్తిడిని తగ్గించేందుకు కన్సాలిడేటెడ్‌ సింకింగ్‌ ఫండ్‌ (సీఎ్‌సఎ్‌ఫ)లోని నిధుల ఉపసంహరణ నిబంధనలను సడలించింది. తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ సడలింపు 2021 మార్చి 31వరకు అమలులో ఉంటుంది. తద్వారా రాష్ట్రాలకు ఆర్‌బీఐ నుంచి మరో రూ.13,300 కోట్ల మేర నిధులు అందుబాటులోకి రానున్నాయి. బాండ్ల జారీ ద్వారా మార్కెట్‌ నుంచి సేకరించిన రుణాల తిరిగి చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్‌బీఐ వద్ద నిర్వహించే ఆపద్ధర్మ నిల్వ (బఫర్‌)నే సీఎ్‌సఎఫ్‌. సాధారణంగా మొత్తం బకాయిల్లో 1-3 శాతాన్ని ఈ ఫండ్‌లో నిల్వ చేస్తాయి. ఆర్‌బీఐ నాగ్‌పూర్‌లోని సెంట్రల్‌ అకౌంట్స్‌ సెక్షన్‌ ఈ ఫండ్‌ను నిర్వహిస్తుంది.  


Updated Date - 2020-05-23T08:46:33+05:30 IST