ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టీకా.. ధరలు ఎంతంటే..!

ABN , First Publish Date - 2021-02-27T22:14:41+05:30 IST

రోనా టీకా పంపిణీ‌లో ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో కరోనా టీకా డోసు ధరను రూ. 250గా కేంద్రం ఖరారు చేసినట్టు సమాచారం.

ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టీకా.. ధరలు ఎంతంటే..!

న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ‌లో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో కరోనా టీకా డోసు ధరను రూ. 250గా కేంద్రం ఖరారు చేసినట్టు సమాచారం. దీనికి రూ. 100ల సర్వీస్ ఛార్జ్ అదనం. దీన్ని లబ్ధిదారులు ఆస్పత్రి వర్గాలకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం టీకాలు ఉచితంగానే లభించనున్నాయి. మార్చి 1 నుంచి సీనియర్ సిటిజన్లను కరోనా టీకాలు వేసేందుకు కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. వీరితో పాటూ 45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా టీకాలు వేసేందుకు కేంద్రం నిర్ణయించింది. జాతీయ ఆరోగ్య మిషన్ ఖరారు చేసిన ఈ ధరలను రాష్ట్రాల పరిశీలనకు పంపినట్టు సమాచారం. తొలి రెండు విడతల్లో కేంద్ర ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు అందించింది. మూడో విడతలో వృద్ధులకు టీకా పంపిణీ చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తోంది. 

Updated Date - 2021-02-27T22:14:41+05:30 IST