IT act, section 66A కేసులను వెనక్కుతీసుకోండి: రాష్ట్రాలను కోరిన కేంద్రం

ABN , First Publish Date - 2021-07-15T01:27:22+05:30 IST

ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ కింద నమోదైన కేసులను వెనక్కుతీసుకోవాలని రాష్ట్రాల పోలీస్ బాస్‌లను కేంద్ర హోం శాఖ తాజాగా కోరింది. ఈ సెక్షన్ కింద కొత్త కేసులేవీ నమోదు చేయద్దని కూడా పేర్కొంది.

IT act, section 66A కేసులను వెనక్కుతీసుకోండి: రాష్ట్రాలను కోరిన కేంద్రం

న్యూఢిల్లీ: ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ కింద నమోదైన కేసులను వెనక్కు తీసుకోవాలని రాష్ట్రాల పోలీస్ బాస్‌లను కేంద్ర హోం శాఖ తాజాగా కోరింది. ఈ సెక్షన్ కింద కొత్త కేసులేవీ నమోదు చేయొద్దని కూడా పేర్కొంది. 2015లోనే రద్దయిన ఈ సెక్షన్ కింద ఇప్పటికీ వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రెండు వారాల్లోగా స్పందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు జులై 5న ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘సెక్షన్ 66ఏ’ కేసులను తక్షణం వెనక్కు తీసుకోవాలంటూ కేంద్రం రాష్ట్రాలను కోరింది. సెక్షన్ 66ఏ ప్రకారం..అవమానకర లేదా వివాదాస్పద సందేశాలను టెక్స్‌ట్, ఆడియో, వీడియో, చిత్రాల రూపంలో పంపిస్తే మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే.. 66ఏలోని పదజాలం అస్పష్టంగానూ, రాజ్యాంగ విరుద్ధంగానూ ఉందంటూ సుప్రీం కోర్టు ఈ సెక్షన్‌ను 2015లో కొట్టేసింది. దీన్ని పూర్తిస్థాయిలో రద్దు చేయడం మినహా మరోమార్గం లేదని కూడా న్యాయస్థానం అప్పట్లో వ్యాఖ్యానించింది. 

Updated Date - 2021-07-15T01:27:22+05:30 IST