Centre confirms: ఆంధ్రాలో ఆక్సిజన్ కొరత వల్లే కరోనా రోగుల మృతి

ABN , First Publish Date - 2021-08-11T17:06:25+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది కొవిడ్ రోగులు మరణించారని కేంద్రం...

Centre confirms: ఆంధ్రాలో ఆక్సిజన్ కొరత వల్లే కరోనా రోగుల మృతి

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది కొవిడ్ రోగులు మరణించారని కేంద్రం నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వల్ల కరోనా సెకండ్ వేవ్ సమయంలో కొద్దిమంది రోగులు మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పార్లమెంటుకు తెలిపింది. కొంత మంది కరోనా రోగులు ఆక్సిజన్ సంక్షోభంతో మరణించారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తేల్చిచెప్పింది. ఎస్వీఆర్ఆర్ ఆసుపత్రిలో మే 10వతేదీన వెంటిలేటరు సపోర్టులో ఉన్న కరోనా రోగుల్లో కొంతమంది మరణించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమకు రాసిన లేఖలో తెలిపిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పార్లమెంటుకు తెలిపారు. 


Updated Date - 2021-08-11T17:06:25+05:30 IST