Agnipath protests: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ABN , First Publish Date - 2022-06-19T01:38:23+05:30 IST

అగ్నిపథ్ పథకంపై ఉద్రిక్తతలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు...

Agnipath protests: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం (Agnipath Scheme)పై ఉద్రిక్తతలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం శనివారంనాడు అప్రమత్తం చేసింది. పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నోట్ పంపింది. కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ అర్చనా వర్మ సంతకం చేసిన లేఖలను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, అడ్మినిస్ట్రేటర్ అడ్వైజర్లకు పంపింది.


''అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగే నిరసనలు ప్రధానంగా పలువురు ఒకచోట గుమిగూడటం, ధర్మాలు, ప్రదర్శనలు, మార్చ్‌లు, లూటీలు, ప్రజా ఆస్తుల విధ్వంసం రూపంలో ఉంటాయి. భారత్ బంద్, ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద  ఈనెల 20న నిరసలకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సర్క్యులేషన్‌లో ఉంది. ఇదే తరహా నిరసనలు కొద్దికాలం పాటు ఉండే అవకాశాలున్నాయి'' అని ఆ లేఖలో అర్చనా వర్మ పేర్కొన్నారు. ఈ తరహా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కీలకమైన ప్రాంతాలు, ముఖ్యంగా రైల్వే స్టేషన్లు/లైన్లు, జాతీయ రహదారులు, కీలక ప్రభుత్వ కార్యాలయాల వద్ద తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం అనివార్యమని, తద్వారా శాంతిభద్రతలు, ప్రశాంతతకు ఎలాంటి అవాంతరాలు రాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆ నోట్ సూచించింది. కాగా, అగ్నిపథ్ నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి నిరసనకారులు రైల్వే స్టేషన్లు, లైన్లను టార్గెట్ చేసుకోవడంతో నష్టం కూడా భారీగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-06-19T01:38:23+05:30 IST