Abn logo
Aug 2 2020 @ 18:01PM

కోవిడ్ పేషెంట్ల‌కు స్మార్ట్ ఫోన్లను అనుమతించండి... రాష్ట్రాలను కోరిన కేంద్రం

న్యూఢిల్లీ: ఆసుపత్రి పాలయిన కోవిడ్ పేషెంట్లు స్మార్మ్‌ఫోన్లు, ట్యాబ్‌లు వాడేందుకు మానవతా దృక్పథంతో అనుమతించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం ఆదివారంనాడు కోరింది. ఇందువల్ల కోవిడ్ పేషెంట్లు తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో మాట్లాడేందుకు, మానసికంగా స్వాంతన పొందేందుకు వీలవుతుందని సూచించింది. ఈ మేరకు రాష్ట్రాల హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్ఎస్) ఒక లేఖలో కోరింది. 

 

పేషెంట్లు, వారి కుటుంబ సభ్యుల మధ్య సమాచారం పంచుకునేందుకు వీలుగా ఆసుపత్రులలో సిబ్బంది ప్రోటోకాల్ ప్రకారం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌‌‌లను డిస్‌ఇన్‌ఫెక్టింగ్ చేసేలా చూడాలని డీజీహెచ్ఎస్ కోరింది. వివిధ ఆసుపత్రుల్లోని కోవిడ్ వార్డులు, ఐసీయూల్లో చేరిన పేషెంట్ల సైకలాజికల్ అవసరాలను ప్రభుత్వం యంత్రాంగం, వైద్య బృందాలు బాధ్యతగా తీసుకోవాలని సూచించింది.

Advertisement
Advertisement
Advertisement