న్యూఢిల్లీ : పీహెచ్‌డీసీసీఐ నివేదికను కేంద్రం ఆమోదించింది. పీహెచ్‌డీసీసీఐ నివేదిక అధ్యయనం... తొమ్మిది అత్యంత ఆశాజనకమైన రంగాల నుండి 75 ఉత్పత్తులను, 32 అధ్యాయాలను గుర్తించింది. కాగా... భారత్ ఈ ఉత్పత్తులలో 3.6 శాతం మాత్రమే ఎగుమతి చేస్తోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2022)లో భారత్ ఎగుమతులు కేవలం $ 400 బిలియన్ల లక్ష్యాన్ని అధిగమించాయి. ఇప్పుడు ప్రభుత్వం... 2023 ఆర్ధిక సంవత్సరంలో $ 500 బిలియన్ల లక్ష్యాన్ని సాధించే లక్ష్యంతో ఉంది. కాగా... భారత్‌లో ఎగుమతులను పెంచడంలో సహకరించేందుకు 75 ఎగుమతి ఉత్పత్తులను గుర్తించే పరిశ్రమల సంస్థ పీహెచ్‌డీసీసీఐ నివేదిక నివేదికను వాణిజ్య/పరిశ్రమల మంత్రిత్వ శాఖకు అందించాల్సి ఉన్న ప్రక్రియ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది.
అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, అరబ్ ఎమిరేట్స్, చైనా, మెక్సికో, ఆస్ట్రేలియా తదితర దేశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. రానున్న ఆరు సంవత్సరాల నాటికి మార్కెట్లు $ 750 బిలియన్ల సరుకుల ఎగుమతి లక్ష్యాన్ని చేరుకుంటాయని భావిస్తున్నారు. కాగా... ఈ రంగాల్లో వ్యవసాయం, ఖనిజాలు, ఇంధనాలు, రసాయనాలు, అనుబంధ ఉత్పత్తులు, వస్త్ర/పాదరక్షలు, మెటల్/నాన్-మెటల్స్, మెషినరీ/మెకానికల్ ఉపకరణాలు, రవాణా/ఆటోమొబైల్స్, ఆప్టికల్ ఫోటోగ్రాఫిక్/సినిమాటోగ్రాఫిక్ ఉన్నాయి. సంబంధఇత నివేదిక ప్రకారం... ఈ 75 ఉత్పత్తులు ప్రపంచానికి భారత్ మొత్తం ఎగుమతుల్లో $ 127.8 బిలియన్ల మేరకు ఉంటాయి. ఈ ఉత్పత్తుల మొత్తం ప్రపంచ దిగుమతి 2020 లో $ 3.5 ట్రిలియన్ల మేర ఉంటుంది.
ఇవి కూడా చదవండి