దేశంలో ‘రెమ్‌డెసివిర్‌’ మార్కెటింగ్‌కు పచ్చజెండా

ABN , First Publish Date - 2020-06-03T07:50:52+05:30 IST

కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తున్న మరో ఔషధం భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. అమెరికా ఫార్మా దిగ్గజం గిలీడ్‌ సైన్సె్‌సకు చెందిన యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’ను దేశంలో...

దేశంలో ‘రెమ్‌డెసివిర్‌’ మార్కెటింగ్‌కు పచ్చజెండా

  • అమెరికా కంపెనీకి భారత్‌ అనుమతి
  • రష్యా తొలి కొవిడ్‌ ఔషధం రెడీ


న్యూఢిల్లీ, జూన్‌ 2 : కరోనా చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తున్న మరో ఔషధం భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. అమెరికా ఫార్మా దిగ్గజం గిలీడ్‌ సైన్సె్‌సకు చెందిన యాంటీ వైరల్‌ ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’ను దేశంలో మార్కెటింగ్‌ చేసుకునేందుకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎ్‌ససీవో) పచ్చజెండా ఊపింది. తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న చిన్నారులు, యుక్త వయస్కులకు అత్యవసర పరిస్థితుల్లో గరిష్ఠంగా ఐదు రోజులపాటు ‘రెమ్‌డెసివిర్‌’ ఇంజెక్షన్‌ ద్వారా అందించవచ్చని మార్గదర్శకాలు జారీచేసినట్లు సమాచారం. మే 29న గిలీడ్‌ సైన్సెస్‌ దరఖాస్తు చేయగా.. కరోనా సంక్షోభం నేపథ్యంలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే(జూన్‌ 1) సీడీఎ్‌ససీవో అనుమతులు మంజూరు చేసింది. గిలీడ్‌ సైన్సెస్‌ అమెరికాలో ఉత్పత్తి చేసే ‘రెమ్‌డెసివిర్‌’ ఔషధాలను ముంబైలోని క్లినెరా గ్లోబల్‌ సర్వీసె్‌సకు దిగుమతి చేస్తారని, అక్కడి నుంచే పంపిణీ జరుగుతుందని తెలుస్తోంది. ఇక రష్యా తొలిసారిగా కరోనా చికిత్సకు ‘ఎవిఫవిర్‌’ అనే యాంటీ వైరల్‌ ఔషధం వాడానికి పచ్చజెండా ఊపింది. ముంబైకి చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మా కూడా దీనికి సంబంధించిన ఓ ఔషధంతో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తోంది. 

Updated Date - 2020-06-03T07:50:52+05:30 IST