Abn logo
Oct 27 2021 @ 11:32AM

world టాప్‌ ప్రొఫెసర్ల జాబితాలో మనవాళ్లు

హెచ్‌సీయూ నుంచి నలుగురు

హైదరాబాద్‌ సిటీ: ప్రపంచంలోని టాప్‌ ప్రొఫెసర్ల జాబితాలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి స్థానం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా పలు వర్సిటీల్లోని ప్రొఫెసర్ల పరిశోధన ప్రచురణలపై స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన డేటాబే్‌సలో అత్యుత్తమ పరిశోధన ప్రచురణల ఆధారంగా ఉత్తమ ప్రొఫెసర్లను ఎంపిక చేశారు. టాప్‌ 200 మందిలో హెచ్‌సీయూకు చెందిన నలుగురు ప్రొఫెసర్లకు చోటు దక్కింది. స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సె్‌సకి చెందిన ఎంఎన్‌వీ ప్రసాద్‌.. పర్యావరణ రంగంలో 102వ ర్యాంక్‌ సాధించగా, స్కూల్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ విభాగానికి చెందిన అశ్వినీనంగియా ఇనార్గానిక్‌, న్యూక్లియర్‌ కెమిస్ట్రీ విభాగంలో 121వ ర్యాంకు పొందారు. స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్‌ విభాగం నుంచి సీఆర్‌ రావు 184 ర్యాంకు, ఇంగ్లిష్‌ విభాగానికి చెందిన ప్రమోద్‌ కె.నాయర్‌ సాహిత్య అధ్యయన రంగంలో 120వ ర్యాంకు సాధించారు. నిరుడు టాప్‌ జాబితాలో ఉన్న ఎంఎన్‌వీ ప్రసాద్‌ 116వ ర్యాంకు నుంచి ప్రస్తుతం 102వ ర్యాంక్‌కు చేరుకోగా, ప్రమోద్‌ కె.నాయర్‌ 189వ ర్యాంకు నుంచి ప్రస్తుతం 120 ర్యాంకు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 200మంది ప్రొఫెసర్లలో సాహిత్య అధ్యయన రంగం నుంచి ర్యాంకు పొందిన వారిలో ప్రమోద్‌ కె.నాయర్‌ ఒక్కరే ఉన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...