మా పెట్టుబడులకు కేంద్రమే హామీ ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-02-25T11:01:33+05:30 IST

రాష్ట్రంలో కియ మోటార్స్‌ విషయంలో జరిగిన పరిణామాలతో.. కొరియా ట్రేడ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తర్వాతి ప్రభుత్వాలు కూడా కొనసాగించేలా చేసేలా కేంద్రమే చూడాలని కోరింది. పెట్టుబడులకు కూడా అదే హామీ

మా పెట్టుబడులకు కేంద్రమే హామీ ఇవ్వాలి

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కియ మోటార్స్‌ విషయంలో జరిగిన పరిణామాలతో.. కొరియా ట్రేడ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తర్వాతి ప్రభుత్వాలు కూడా కొనసాగించేలా చేసేలా కేంద్రమే చూడాలని కోరింది. పెట్టుబడులకు కూడా అదే హామీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ‘ప్రభుత్వాలు ఐదేళ్లకోసారి మారతాయి. కానీ విధానాలు కనీసం 15-20 ఏళ్లపాటు ఉండేలా చూడాలి. అదే సమయంలో ఒప్పందాలపై సంతకాలు చేసింది ఒక వ్యక్తి కాదు.. ప్రభుత్వం అన్నది గమనంలో ఉంచుకోవాలి’ అని దక్షిణ కొరియా ట్రేడ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ అధ్యక్షుడు యంగ్‌ కుమ్‌ మూన్‌   పేర్కొన్నారు.


దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకోవాలన్నారు. ‘ఏషియన్‌ కమ్యూనిటీ న్యూస్‌’లో ఈ విషయాలను తాజాగా ప్రచురించారు. కొరియాకే కాదు.. ఇతర దేశాలకు కూడా కియ విషయంలో జరిగిన పరిణామాలు మంచి సంకేతాలు పంపవని మూన్‌ అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లాలో 23 లక్షల చదరపు అడుగుల్లో కియ ప్లాంటు నిర్మాణం చేశారు. భారత్‌లోనే కాకుండా.. విదేశాలకు కూడా ఇక్కడి నుంచే కార్లు ఎగుమతులు చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇటీవల ఆ ప్లాంటు తమిళనాడుకు తరలిపోయేందుకు.. అక్కడ స్థలం చూడాలని సోదర సంస్థ హ్యుండయ్‌ మోటార్స్‌ను అడగడం కలకలం సృష్టించింది. ఆంధ్రలో గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను సమీక్షిస్తామనడం, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనడం, ఇతరత్రా కారణాలు దీనికి బీజం వేశాయి.


తమిళనాడుకు తరలించినా.. రేపు అక్కడ కూడా ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా.. ‘అందుకే భారత్‌లో పెట్టే పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వమే హామీ ఇవ్వాలి. విధానాలు దీర్ఘకాలం పాటు మారకుండా ఉంటాయని చెప్పాలి. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకునే ఒప్పందాలను.. తర్వాత వచ్చే ప్రభుత్వాలు గౌరవించేలా చట్టం తీసుకురావాలి’ అని మూన్‌ సమాధానమిచ్చారు.  భారత్‌-కొరియా మధ్య ఇప్పుడున్న 21 బిలియన్‌ డాలర్ల వ్యాపారాలు, పెట్టుబడులను వచ్చే పదేళ్లలో 50 బిలియన్‌ డాలర్లకు పెంచాలన్నది ఇరుదేశాల లక్ష్యమని.. ఆ దిశగా వెళ్లేందుకు కేంద్రం ఇలాంటి చట్టం తీసుకురావాలని ఉద్ఘాటించారు.

Updated Date - 2020-02-25T11:01:33+05:30 IST