రైతు భరోసా పనితీరుపై కేంద్ర బృందం ఆరా..

ABN , First Publish Date - 2022-07-07T06:12:44+05:30 IST

పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని రైతు సంక్షేమ శాఖ కేంద్రం బృందం బుధవారం పరిశీలించింది.

రైతు భరోసా పనితీరుపై కేంద్ర బృందం ఆరా..

వణుకూరు(కంకిపాడు)/గన్నవరం, జూలై 6 : పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని రైతు సంక్షేమ శాఖ కేంద్రం బృందం బుధవారం పరిశీలించింది. రైతు సంక్షేమ శాఖ కేంద్ర కార్యదర్శి మనోజ్‌ అహుజతో పాటు జాయింట్‌ సెక్రటరి రితీష్‌ చౌహాన్‌లు రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి రైతులకు అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా పని తీరు, ఆర్‌బికేల ద్వారా రైతులకు అందుతున్న సంక్షేమ పథకాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ వంటి వాటిపై ఆరా తీశారు. రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని కేంద్రం బృందం రైతులకు సూచించింది. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.సునీల్‌, నోడల్‌ అధికారి అజయ్‌ కరణ్‌, పూనం మాల కొండయ్య, శ్రీధర్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.గన్నవరంలో స్థానిక సమీకృత రైతు సమాచార కేంద్రాన్ని సెక్రటరీ రితేష్‌ చౌహాన్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.సునీల్‌, నోడల్‌ ఆఫీసర్‌ అజయ్‌ కరణ్‌తో కలసి ఈ కేంద్రం సందర్శించారు. ఆర్‌బీకే స్టూడియో, ఛానల్‌ ద్వారా శాస్త్రవేత్తలు అభ్యుదయ రైతులతో లైవ్‌ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కేంద్రం అందిస్తున్న సేవలను వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య కేంద్ర బృందానికి వివరించారు. కమీషనర్‌ శేఖర్‌ బాబు, జాయింట్‌ డైరెక్టర్‌ వి.శ్రీధర్‌, జిల్లా వ్యవసాయాధికారి మనోహర్‌ ఏడీఏ సునీల్‌, ఏవో లక్ష్మీ తేజశ్వి పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T06:12:44+05:30 IST