Abn logo
Sep 25 2021 @ 23:34PM

ఉపాధి హామీ పనులను పరిశీలించిన కేంద్ర బృందం

నరసన్నపేటలో వేతనదారులతో మాట్లాడుతున్న కేంద్రబృంద సభ్యులు

నరసన్నపేట, సెప్టెంబరు 25: ఉపాధిహామీ పథకంలో గతేడాది చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డులను కేంద్ర బృందం శనివారం కార్యాలయంలో పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు  బీఎన్‌ రావు, కిరణ్మయిలు.. మండలంలో గతేడాది ఉపాధి పనులు, ఎంతమంది వేతనదారులు పాల్గొన్నారు. ఎంతమేర వేతనం పొందారు, మెటీరియల్‌ కాంపొనెంట్‌ తదితర అంశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాల యంలో మొక్కలు నాటే వేతనదారులతో మాట్లాడారు. అనంతరం జమ్ము గ్రామ సచివాలయంలో పంచాయతీలో చేపట్టిన పనులపై వేతనదారులతో ఆరీ తీశారు. శివరాంపురం రోడ్డు, గడ్డెయ్యపేటలో జగనన్న కాలనీల లే అవుట్‌ పనులను కేంద్ర బృందం పరిశీలించారు.  కార్యక్రమంలో డ్వామా పీడీ కూర్మనాథ్‌, ఏపీడీ అలివేలు మంగమ్మ, వాసుదేవరావు, ఎంపీడీవో రవికుమార్‌, ఏపీవో యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.