Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.27,500 జీతంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2022-09-23T00:53:28+05:30 IST

ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. ఉపాధ్యాయ పోస్టుల కోసం తాజాగా నోటిఫికెషన్(Job Notification) విడుదలైంది. ఈ పోస్టులకు ఎంపికైతే అత్య

Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.27,500 జీతంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఇంటర్నెట్ డెస్క్: ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. ఉపాధ్యాయ పోస్టుల కోసం తాజాగా నోటిఫికెషన్(Job Notification) విడుదలైంది. ఈ పోస్టులకు ఎంపికైతే అత్యధికంగా నెల నెలా రూ.27,500 జీతం పొందొచ్చు. ఈ క్రమంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏది? ఏజ్ లిమిట్‌కు సంబంధించిన నిబంధనలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అసలు ఎలా ఎంపిక చేస్తారు? అనే పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..


ఇండియన్ రైల్వే(Indian Railway) నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. భుసావల్ డివిజన్‌(మహారాష్ట్ర)లోని రైల్వే డిపార్ట్‌మెంట్ పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టు(Teacher posts)లను భర్తీ చేయడానికి సెంట్రల్ రైల్వే ఈ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. రాత పరీక్ష లేకుండానే పోస్టులను భర్తీ జరగనుంది. 18-65 మధ్య వయసు అభ్యర్థులు ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి పోస్టును బట్టి 21,250 - 27,500 వరకు జీతాన్ని పొందొచ్చు. 



మొత్తం 22 పోస్టుల కోసం నోటిఫికేషన్(Job Notification for Teacher posts) విడుదల చేసిన సెంట్రల్ రైల్వే.. కాంట్రాక్ట్(దాదాపు 200 పని దినాల కోసం) విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. 5 పీజీటీ పోస్టులు(నెల జీతం 27,500), 8 టీజీటీ పోస్టులు (నెల జీతం 26,250), 9 పీఆర్‌టీ పోస్టుల(నెల జీతం రూ.21,250) కోసం భర్తీ ప్రక్రియ సాగుతుంది.  ఇంటర్వ్యూ విధానంలో ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఔత్సాహికులు వచ్చే నెల 4న అంటే.. 04-10-2022న భుసావల్‌లోని డీఆర్‌ఎం కార్యాలయంలో జరిగే ఇంటర్యూకు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతోపాటు వాటికి సంబంధించిన అటెస్టెడ్ జిరాక్స్ సెట్‌తో నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు తదితరాలను ఈ https://cr.indianrailways.gov.in/ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.


పోస్టుల వివరాలు..



Updated Date - 2022-09-23T00:53:28+05:30 IST