కులగణన ఎన్నడూ చేయలేదు: కేంద్రం

ABN , First Publish Date - 2021-12-01T08:19:48+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు మినహా కులాల వారీగా ...

కులగణన ఎన్నడూ చేయలేదు: కేంద్రం

న్యూఢిల్లీ, నవంబరు 30: దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు మినహా కులాల వారీగా  జనగణన ఎన్నడూ చేయలేదని కేంద్రం వివరించింది. కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైనా విధానాన్ని అవలంబించనుందా అని లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021 జనగణన నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని 2019, మార్చి 28న గెజిట్‌లో నోటిఫై చేసినట్లు వివరించారు.

Updated Date - 2021-12-01T08:19:48+05:30 IST