విద్యార్థులను తరలించేందుకు అన్ని విధాలా సహకరించండి

ABN , First Publish Date - 2022-03-04T19:30:08+05:30 IST

ఉక్రెయిన్‌ యుద్ధవాతావరణంలో భీతిల్లుతున్న తమిళ విద్యార్థులను స్వస్థలాలకు తరలిం చేందుకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యవేక్షణా కమిటీకి అన్ని విధాలా సహకరించాలని కోరుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ

విద్యార్థులను తరలించేందుకు అన్ని విధాలా సహకరించండి

                      - కేంద్ర మంత్రికి Stalin లేఖ


చెన్నై: ఉక్రెయిన్‌ యుద్ధవాతావరణంలో భీతిల్లుతున్న తమిళ విద్యార్థులను స్వస్థలాలకు తరలిం చేందుకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పర్యవేక్షణా కమిటీకి అన్ని విధాలా సహకరించాలని కోరుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జయశంకర్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లేఖ రాశారు. ముగ్గురు తమిళ ఎంపీలు, ఓ శాసనసభ్యుడు, నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ఉక్రెయిన్‌లోని తమిళ విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపడుతోందని, అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరమని స్టాలిన్‌ పేర్కొన్నారు. తమిళ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు ఆ కమిటీకి తగు సహాయ సహకారాలు అందిం చాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమిళ విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు ఓ సమన్వయకర్తను నియమించాలని ఫిబ్రవరి 28న తాను చేసిన సూచన అంగీకరిం చినందుకు కేంద్ర మంత్రి జయశంకర్‌కు స్టాలిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఉక్రెయిన్‌లో ఉన్న తమిళ విద్యార్థుల వివరాలన్నింటిని సేకరిస్తు న్నామని, వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, రాయబార కార్యాలయాలకు అందజేస్తున్నామని ఆయన వివరించారు.  సమారు వెయ్యిమంది తమిళ విద్యార్థులు రుమేనియా, పోలండ్‌, హంగేరి, స్లోవాకియాలలో తలదాచు కుంటున్నారని, వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని స్టాలిన్‌ ఆ లేఖలో కోరారు.

Updated Date - 2022-03-04T19:30:08+05:30 IST