తమిళ బ్యాంకుల్లో తమిళంలోనే కార్యకలాపాలు

ABN , First Publish Date - 2022-07-19T15:08:33+05:30 IST

తమిళనాడులోని బ్యాంకుల్లో తమిళంలో కార్యకలాపాలు సాగేలా చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పార్లమెంటు

తమిళ బ్యాంకుల్లో తమిళంలోనే కార్యకలాపాలు

                   - కేంద్ర మంత్రి Nirmala sitaran


పెరంబూర్‌(చెన్నై, జూలై 18: తమిళనాడులోని బ్యాంకుల్లో తమిళంలో కార్యకలాపాలు సాగేలా చర్యలు చేపట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా డీఎంకే ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్‌, రాష్ట్రంలోని బ్యాంకుల్లో నగదు, పథకాలకు సంబంధించిన వివరాలు ఆంగ్లంలో వస్తుండడంతో ఆ భాష రాని తమిళులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ తమిళం రాని బ్యాంకు సిబ్బందికి తమిళం నేర్చుకొనేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగదు కార్యకలాపాలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌, ఏటీఎం కేంద్రాల్లో రశీదులు తమిళంలో అందించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-07-19T15:08:33+05:30 IST