కరీంనగర్: తెలంగాణ సాధనలో బీజేపీ (BJP) పాత్ర ఉందని కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే (Mahendranath pande ) తెలిపారు. శనివారం హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్ట్‌లు కల్వకుంట్ల (Kalvakuntla) కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని విమర్శించారు. తెలంగాణలో చేపట్టిన దళిత బంధు స్కీం ఫెయిల్ అయిందని.. బంజరు భూములకు కూడా రైతుబంధు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మోదీ(Modi) హయాంలో బీజేపీని అధికారంలోకి తేవాలన్నారు. తెలంగాణలో అమలు చేసే పథకాల్లో టీఆర్ఎస్ లీడర్లు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరోపించారు.
ఇవి కూడా చదవండి