బూతులు మాట్లాడనంటే ఓకే.. కేసీఆర్ సవాల్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-12-01T01:03:33+05:30 IST

వరి ధాన్యం విషయంలో తనపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. యాసంగి ధాన్యం విషయంలో తెలంగాణ రైతులకు...

బూతులు మాట్లాడనంటే ఓకే.. కేసీఆర్ సవాల్‌ను స్వీకరించిన కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: వరి ధాన్యం విషయంలో తనపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. యాసంగి ధాన్యం విషయంలో తెలంగాణ రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశానని ఆయన తెలిపారు. కేంద్రానికి సంబంధించిన మంత్రితో మాట్లాడి చెప్పానని,  ఉన్న బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘ధాన్యం మొత్తం మేమే కొంటాం. సీఎం కేసీఆర్ ఆకాశం ఊడిపడినట్టు, భూమి బద్దలైన్నట్టు, టీఆర్ఎస్ పార్టీ కూలిపోయానట్టు కేసీఆర్ మాట్లాడారు. నేను మంత్రి అవ్వడం కేసీఆర్‌కి ఇష్టం ఉందో లేదో. నేను సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చాను. తెలంగాణ ఉద్యమమంలో పోరాట యాత్ర కూడా చేపట్టాను. బీజేపీ కేంద్ర న్యాయకత్వాన్ని తెలంగాణ బిల్లుకు ఒప్పించాను. కేసీఆర్‌కి నేను అంటే కోపమో, బాధనో అర్ధం కావడం లేదు. చాలా సార్లు కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. ఎంపీ సంతోష్‌తో మాట్లాడను. అపాయింట్మెంట్ కావాలని అడిగినా ఇవ్వలేదు.’’ అని కిషన్ రెడ్డి తెలిపారు. 


రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా తెలంగాణ బిడ్డ కేంద్రమంత్రి అయ్యాడని చూడలేదని, తనను రండా అని మాట్లాడినా బాధలేదని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజలు ఎవరు ఏంటి అనేది నిర్ణయిస్తారన్నారు. తనపై  చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ నైతికతకు వదిలేస్తున్నానని చెప్పారు. నేను తెలంగాణ గడ్డమీదే పుట్టాను. కేసీఆర్ మాటలకు భయపడే వ్యక్తిని కాదు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వాడిన భాష ఏ రకమైనదో ఆయనే చెప్పాలి. ప్రజాస్వామ్యబద్దంగా నాగరిక భాషలో విమర్శించవచ్చు. కేసీఆర్‌కి అభద్రతా భావం, అందువల్లే ఇష్టనుసారంగా మాట్లాడారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు. అమరవీరుల స్థూపం దగ్గరకి వస్తాను. ముఖ్యమంత్రితో చర్చకు సిద్ధంగా ఉన్నాను. బూతులు మాట్లాడకుండా వస్తే చర్చకు సిద్ధంగా ఉన్నాను. కేసీఆర్‌లా బూతులు మాట్లాడలేను. పార్లమెంట్ సమావేశాలు జరుగతున్నాయి. సమావేశం లేని రోజు చర్చకు సిద్ధం.’’ అని సీఎం కేసీఆర్ సవాల్‌కు కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 




Updated Date - 2021-12-01T01:03:33+05:30 IST