Abn logo
Oct 25 2020 @ 07:32AM

దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kaakateeya

విజయవాడ: విజయదశమిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆదివారం నాడు విజయవాడకు వచ్చిన ఆయన ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. కరోనా మహమ్మారి నుండి ప్రజలు అందరూ బయటపడాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. అలాగే పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రజలు ఆనందంగా ఉండాలని కోరానని చెప్పారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ ఎదగాలని, దేశ ప్రజలకు అమ్మవారి ఆశీర్వాలు ఉండాలని అమ్మవారిని కిషన్ రెడ్డి వేడుకున్నారు.

Advertisement
Advertisement