సర్జికల్ స్ట్రైక్‌పై కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు: Kishan reddy

ABN , First Publish Date - 2022-02-15T18:54:44+05:30 IST

సర్జికల్ స్ట్రైక్‌పై కేసీఆర్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని... ప్రపంచమంతా చూసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

సర్జికల్ స్ట్రైక్‌పై కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు: Kishan reddy

హైదరాబాద్: సర్జికల్ స్ట్రైక్‌పై కేసీఆర్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని... ప్రపంచమంతా చూసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్‌లో అభినందన్ అనే యుద్ధ వీరుడు పట్టుపడితే 24 గంటల్లో ఇండియాకు రప్పించామని తెలిపారు. ఫ్రీ కరెంట్ రైతులకే కాదు... అన్ని వర్గాల వారికి ఫ్రీ ఇచ్చినా బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని ఏ రాష్ట్రానికి కేంద్రం ఆదేశాలు ఇవ్వలేదన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలనే ఆలోచన కేంద్రానికి లేదని తెలిపారు. యూరియాపై వందశాతం సబ్సిడీ కేంద్రమే ఇస్తోందని అన్నారు. త్వరలో మోదీ తెలంగాణ పర్యటన ఉందని, రామగుండంలో ఫ్యాక్టరీ స్థాపనలో పాల్గొంటారన్నారు. యూరియా సబ్సిడీ గత ఏడాది 79 వేలు, ఈ ఏడాది 1లక్ష కోట్లు పెట్టామని చెప్పారు. గతంలో పోల్చితే ఈ సారి 30 శాతానికి పైగా సబ్సిడీ పెంచామమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-15T18:54:44+05:30 IST