Advertisement
Advertisement
Abn logo
Advertisement

త్వరలో చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్: Kishan reddy

సూర్యాపేట: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో త్వరలో చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన 100 మంది జర్నలిస్టులకి రూ.5లక్షల నగదును కేంద్రం అందించిందని తెలిపారు. కరోనా బారిన పడి తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల విద్యాభ్యాసం భాద్యతను కేంద్రం తీసుకుంటుందన్నారు. కరోనా వారియర్స్‌కు పాదాభివందనాలు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement