వరంగల్‌ కోటను అభివృద్ధి చేస్తాం..

ABN , First Publish Date - 2021-10-22T05:07:22+05:30 IST

వరంగల్‌ కోటను అభివృద్ధి చేస్తాం..

వరంగల్‌ కోటను అభివృద్ధి చేస్తాం..
ఖిలావరంగల్‌ కోటలోకి వస్తున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు

అద్భుత కట్టడాలను పరిరక్షిస్తాం : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

వరంగల్‌ కోటలో లైట్‌ అండ్‌ సౌండ్‌షోను తిలకించిన మంత్రి 


ఖిలావరంగల్‌, అక్టోబరు 21: ఖిలావరంగల్‌ కోటను కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తామని కేంద్రపర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. వరంగల్‌ ఉమ్మడిజిల్లా పర్యాటనలో భాగంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి ఖిలావరంగల్‌ కోటను సందర్శించారు. అద్భుత శిల్పాలను, లైట్‌ అండ్‌ సౌండ్‌ షోను ఆసక్తిగా తిలకించారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వరంగల్‌ జిల్లా పర్యాటనలో భాగంగా కేంద్ర నిధులతో రామప్ప, వేయిస్తంభాల దేవాలయం, కల్యాణమండపంతోపాటు కోటలోని కట్టడాలు, దేవాలయాలను పునరుద్ధరిస్తామన్నారు. కోటలో మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కేంద్రపురావస్తు శాఖ సీవో మల్లేశం, టీఎ్‌సటీడీసీ ఎండీ మనోహర్‌రావు, చైర్మన్‌ శ్రీనివా్‌సగుప్తా, బీజేపీ అధికార ప్రతినిధి నాయకుడు రాకే్‌షరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, కార్పొరేటర్‌ చింతాకుల అనిల్‌ కుమార్‌, బీజేపీ వరంగల్‌ తూర్పు ఇన్‌చార్జి కుసుమ సతీష్‌, నాయకులు చింతాకుల సునీల్‌, పుప్పాల రాజేందర్‌, బైరి శ్యామ్‌సుందర్‌, మాదాసి రాజు, అచ్చ విద్యాసాగర్‌, అంకాల జనార్దన్‌, పిట్టల కిరణ్‌, గొర్రె కోటి, రాజు, నలివేల సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.   

కేంద్రమంత్రికి వినతుల వెళ్లువ

ఖిలావరంగల్‌ ప్రాంతానికి వచ్చిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీజేపీ నాయకులు, స్థానికులు గురువారం వినతులను అందజేశారు. ఖిలావరంగల్‌ కోటలో శిల్పాల అభివృద్ధితోపాటు మరుగుదొడ్లు, రోడ్లు, పైప్‌లైన్ల నిర్మాణం, తదితర వసతులను కల్పించాలని కోరారు. రంగశాయిపేట నుంచి ఖిలావరంగల్‌ మీదుగా 200ఫీట్ల రోడ్డులో భూమిని కోల్పోయిన బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బాధితులు పాలకుర్తి సత్యనారాయణ, బజ్జూరి ప్రభాకర్‌, జి వెంకటరమణ, బి.రవీందర్‌, టి.కుమారస్వామి, గంగరబోయిన మధు, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.


మంత్రులను సన్మానించిన టీఎన్జీవోస్‌

వరంగల్‌ కలెక్టరేట్‌: వరంగల్‌ జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి జిల్లాకు విచ్చేసిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను జిల్లా టీఎన్జీవోస్‌ సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఖిలావరంగల్‌ పర్యటనకు విచ్చేసిన మంత్రులకు టీఎన్జీవోస్‌ గురువారం కలిసి బోకేలను అందించి సత్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్‌, ప్రధాన కార్యదర్శి గాజె వేణుగోపాల్‌, రాజే్‌షకుమార్‌, జగన్మోహన్‌రావు, మురళీధర్‌రెడ్డి, పాలకుర్తి సదానందం, హేమానాయక్‌, జగదీశ్వర్‌, సతీష్‌, సాంబమూర్తి, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:07:22+05:30 IST