నెక్లెస్‌రోడ్డులో పతంగుల పండుగ...పాల్గొన్న కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-14T18:30:27+05:30 IST

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని నెక్లెస్‌రోడ్డులో పతంగుల పండుగను నిర్వహించారు.

నెక్లెస్‌రోడ్డులో పతంగుల పండుగ...పాల్గొన్న కిషన్‌రెడ్డి

హైదరాబాద్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని నెక్లెస్‌రోడ్డులో పతంగుల పండుగను నిర్వహించారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావ్ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలుగు ప్రజలందరికీ బీజేపీ , కేంద్ర ప్రభుత్వం తరుపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో దేశం అన్ని రంగాల్లో మార్పులు తీసుకురావాలని ఈ పండగ సందర్భంగా కోరుకుంటున్నానన్నారు. కరోనా మహమ్మారి నుండి ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ వచ్చిందని ఆయన తెలిపారు. దేశంలో అన్ని రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటులో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని.. వారి జీవితాల్లో ఈ సంక్రాంతి నుండే మార్పు వస్తుందని అన్నారు.


ప్రపంచంలో నాలుగు కంపెనీలు వ్యాక్సిన్ కనుక్కుంటే అందులో రెండు మన దేశానికి చెందినవే, ఒకటి మన తెలంగాణకి చెందినదని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అన్ని రకాల సమస్యల నుండి తేరుకోవలని కోరుకుంటున్నానన్నారు. సెప్టెంబర్ 17న నిజమైన క్రాంతి రావాలని.. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించే నిజమైన రోజులు రావాలని కోరుకుంటున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. 


Updated Date - 2021-01-14T18:30:27+05:30 IST