పతకం గెలవకపోవచ్చు.. కోట్లమంది హృదయాలు గెలిచారు: కిరెన్ రిజిజు

ABN , First Publish Date - 2021-08-10T07:02:20+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలతో తిరిగొచ్చిన క్రీడాకారుల సన్మాన సభ సోమవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని..

పతకం గెలవకపోవచ్చు.. కోట్లమంది హృదయాలు గెలిచారు: కిరెన్ రిజిజు

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలతో తిరిగొచ్చిన క్రీడాకారుల సన్మాన సభ సోమవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్రీడాకారులకు ప్రత్యేకంగా సన్మానించడంతో పాటు వారిని ప్రశంసిస్తూ అనేక నజరానాలు కూడా అందించారు. ఈ క్రమంలోనే కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. పతకాలు గెలిచిన క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పతకం అందుకోలేకపోయినా.. భారత హాకీ మహిళా జట్టు దేశ ప్రజల హృదయాలను గెలుచుకుందని కొనియాడారు. మహిళా జట్టుతో ప్రధాని మాట్లాడిన వీడియో ఈ మధ్యన విడుదలైందని, ఆ వీడియో చూసి ఎంతో మందిక కన్నీరు పెట్టుకున్నారని అన్నారు.


కాగా.. క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌, ఆస్ట్రేలియా వంటి జట్లపై అద్భుత విజయంతో సెమీస్ చేరిన భారత మహిళల హాజీ జట్టు సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో పోటీ పడినా.. అక్కడ కూడా ఓటమి చవి చూసింది. దీంతో పతకం గెలుచుకోకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Updated Date - 2021-08-10T07:02:20+05:30 IST