సామాజిక దూరం, లాక్‌డౌన్ రెండే శక్తివంతమైన టీకాలు : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

ABN , First Publish Date - 2020-04-10T00:29:45+05:30 IST

కరోనాను ఎదుర్కోవాలంటే సామాజిక దూరం, లాక్‌డౌన్ రెండే రెండు అత్యంత శక్తివంతమైన సామాజిక టీకాలని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి డా. హర్షవర్ధన్ గురువారం

సామాజిక దూరం, లాక్‌డౌన్ రెండే శక్తివంతమైన టీకాలు : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ : కరోనాను ఎదుర్కోవాలంటే సామాజిక దూరం, లాక్‌డౌన్ రెండే రెండు అత్యంత శక్తివంతమైన సామాజిక టీకాలని కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి డా. హర్షవర్ధన్ గురువారం ప్రకటించారు. బెన్నెట్ట అంతర్జాతీయ యూనివర్శిటీ నిర్వహించిన గ్లోబల్ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో అయితే కరోనా విరుగుడుకు ఎలాంటి ఔషదాలూ లేవని, ఈ రెండే శక్తివంతమైనవని స్పష్టం చేశారు. ఐసోలేషన్ పద్ధతులతో పాటు ప్రభుత్వం చేస్తున్న సూచనలను దేశ ప్రజలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా కేసుల విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం చాలా మెరుగైన స్థితిలోనే ఉందని డా. హర్షవర్ధన్ తెలిపారు. 


Updated Date - 2020-04-10T00:29:45+05:30 IST