Abn logo
Sep 19 2021 @ 00:28AM

విద్యుత్‌ చార్జీల పెంపుపై తెలుగు మహిళల కన్నెర్ర

విద్యుత్‌ బిల్లుల ప్రతులను దహనం చేస్తున్న సెంట్రల్‌ తెలుగు మహిళలు

విద్యుత్‌ చార్జీల పెంపుపై తెలుగు మహిళల కన్నెర్ర

సెంట్రల్‌ టీడీపీ కార్యాలయంలో నిరసన 

కరెంటు బిల్లుల ప్రతులు దహనం

అజిత్‌సింగ్‌నగర్‌, సెప్టెంబరు 18:  పెంచిన విద్యుత్‌ ట్రూఅప్‌ చార్జీలు ఉపసంహరించుకోవాలని కోరుతూ సెంట్రల్‌ టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళలు శనివారం నిరసన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లుల ప్రతులను దహనం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా 60వ డివిజన్‌ కార్పొరేటర్‌ కంచి దుర్గా, సెంట్రల్‌ తెలుగు మహిళ అధ్యక్ష, కార్యదర్శులు దాసరి ఉదయశ్రీ, లబ్బా దుర్గా మాట్లాడుతూ తక్షణమే పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గరిమెళ్ల రాధిక, కృష్ణవరపు దుర్గా, సుబ్బలక్ష్మీ, గౌసియా పాల్గొన్నారు.