కేంద్రానిది పక్షపాత ధోరణి

ABN , First Publish Date - 2022-05-25T05:07:02+05:30 IST

తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో

కేంద్రానిది పక్షపాత ధోరణి
కేసీ తండాలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి

  • విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి


మహేశ్వరం, మే 24 : తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని, రాష్ట్ర విభజన హామీలో భాగంగా రాష్ర్టానికి రావాల్సిన విద్యాసంస్థలను, గిరిజన యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీలను ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలోని కేసీ తండా వద్ద జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, సర్పంచ్‌ మోతీలాల్‌తో కలిసి డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మహేశ్వరం సహకార సంఘంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అదేవిధంగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ డిగ్రీ కాలేజీ మహేశ్వరానికి మంజూరైనా స్థానికంగా భవనం అందుబాటులో లేక తాత్కాలికంగా బడంగ్‌పేట్‌లో కొనసాగిస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ రాద్ధాంతం చేస్తున్నాడని, అతనికి దమ్ముంటే కేంద్రాన్ని ఒప్పించి రాష్ర్టానికి రావాల్సిన ఐఐఎం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. మహేశ్వరానికి డిగ్రీ కళాశాల ఇచ్చిన ఘనత కేసీఆర్‌ సర్కార్‌దేనని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మహేశ్వరాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన జిల్లాకో మెడికల్‌ కళాశాల  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు రానున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బండి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ సునితాఆంధ్యనాయక్‌, ఆర్డీవో వెంకటచారి, తహసీల్దార్‌ ఆర్‌పి జ్యోతి, ఎంపీడీవో నర్సింహులు, ఎంపీటీసీ పోతర్ల సుదర్శన్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు అంగోత్‌ రాజునాయక్‌, నాయకులు హెచ్‌. చంద్రయ్య, కర్రోళ్ల చంద్రయ్య, కూన యాదయ్య, ఎన్‌. సుధీర్‌గౌడ్‌, ఎం. కరుణాకర్‌రెడ్డి, మల్లేష్‌ యాదవ్‌, కంది రమేష్‌, రాఘవేందర్‌రెడ్డి, నవీన్‌, సమీర్‌, శ్రీనివా్‌సరెడ్డి, శ్లీవారెడ్డి, థామ్‌సరెడ్డి, ఎం.రాజేష్‌, సాలీవీరానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.   


ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

కందుకూరు, మే 24 : రాష్ట్ర ప్రజల సంక్షే మానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన 100మంది వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు ఆ గ్రామసర్పంచ్‌ ఇంజమూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి తన నివాసంలో పార్టీ చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మన్నె జయేందర్‌ముదిరాజ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌,  మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షుడు గంగాపురం లక్ష్మీనర్సింహ్మరెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, కృష్ణరాంభూపాల్‌రెడ్డి, అందుగుల సత్యనారాయణ, పొట్టి ఆనంద్‌, సదానంద్‌గౌడ్‌, కాకి దశరథ, మేఘనాథ్‌రెడ్డి, తాళ్ల కార్తీక్‌, రాము, దేవేందర్‌, సపాయిలు, దేవిలాల్‌, విఘ్నేశ్వర్‌రెడ్డి, బొక్క దీక్షిత్‌రెడ్డి, ఎండి అలీ, నవీన్‌, రామకృష్ణ పాల్గొన్నారు.



Updated Date - 2022-05-25T05:07:02+05:30 IST