ఏపీలో వైసీపీపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా?

ABN , First Publish Date - 2021-11-16T01:01:36+05:30 IST

కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాతో జాతీయ కార్యవర్గ సభ్యుల భేటీ సోమవారం తిరుపతిలో జరిగింది. ఏపీలో పార్టీ బలోపేతంపై..

ఏపీలో వైసీపీపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా?

అమరావతి: కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షాతో జాతీయ కార్యవర్గ సభ్యుల భేటీ సోమవారం తిరుపతిలో జరిగింది. ఏపీలో పార్టీ బలోపేతంపై ఈ భేటీలో వాడివేడి చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలకు అమిత్ షా పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. బీజేపీ కార్యక్రమాలకు రాకుండా ‘ఏబీఎన్’, ‘ఆంధ్రజ్యోతి’ని ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందని రాష్ట్ర ముఖ్యనేతలను అమిత్ షా నిలదీశారు. అసలు బీజేపీ వార్తలను కవర్ చేయని సాక్షి మీడియాను బహిష్కరించకుండా పేరున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మీడియా సంస్థను ఎలా బహిష్కరిస్తారని అమిత్ షా ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఎవరు వార్తలు రాసినా.. సమర్ధించాల్సిందేనని షా స్పష్టం చేశారు.


ఈ నేపథ్యంలో ‘‘ఏపీలో వైసీపీపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా?. స్థానిక బీజేపీ నేతలు కొందరిపై అమిత్ షా నిప్పులు కక్కారా?. అమరావతి విషయంలో రాష్ట్ర నాయకత్వ వైఖరిని తప్పుపట్టారా?. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై నిషేధం వ్యవహారంలో సీరియస్ అయిన అమిత్ షా?. పొత్తులపై మాట్లాడే అధికారం ఎవరిచ్చారని కొందరు నేతలను కడిగేసిన అమిత్ షా?. ’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-11-16T01:01:36+05:30 IST