కరోనా నుంచి కోలుకున్నవారికీ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి: కేంద్ర ప్రభుత్వం!

ABN , First Publish Date - 2021-09-12T17:30:19+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న వారు కూడా రెండు డోసుల వ్యాక్సిన్...

కరోనా నుంచి కోలుకున్నవారికీ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి: కేంద్ర ప్రభుత్వం!

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వారు కూడా రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని, అప్పుడే వారికి కరోనా నుంచి రక్షణ లభిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తన అధ్యయనంలో... కోవిడ్-18 నుంచి కోలుకున్నవారు కోవ్యాగ్జిన్ ఒక డోసు తీసుకుంటే సరిపోతుందని, తద్వారా వారికి మరోమారు కరోనా సంక్రమించే అవకాశాలు తక్కువ అని తెలిపింది. అలాగే కరోనా సోకనివారు తప్పని సరిగా రెండు డోసుల టీకా తీసుకోవాలని పేర్కొంది. అయితే ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో కోవిడ్-19 సోకి, వారు ఒక డోసు కోవ్యాగ్జిన్ తీసుకుంటే వారికి కోవిడ్ సోకని వారికున్న స్థాయిలో ఇమ్యూనిటీ సమకూరింది. ఈ విషయాన్ని ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమయ్యింది. 

Updated Date - 2021-09-12T17:30:19+05:30 IST