ఏపీ రాజధానిపై కేంద్రం వేసిన పిటిషన్‌లో లొసుగులు

ABN , First Publish Date - 2020-08-07T01:46:27+05:30 IST

ఏపీ రాజధానిపై మాకు సంబంధంలేదు అని కేంద్రం కౌంటర్ అఫిడవిట్ వేసింది. చాలా మందికి ...

ఏపీ రాజధానిపై కేంద్రం వేసిన పిటిషన్‌లో లొసుగులు

హైదరాబాద్: ఏపీ రాజధానిపై మాకు సంబంధంలేదు అని కేంద్రం కౌంటర్ అఫిడవిట్ వేసింది. చాలా మందికి తెలియని విషయమేంటంటే ఇదేదో రాజధాని కోసం రైతులు పిటిషన్ వేస్తే ఆ పిటిషన్‌లో కోర్టు కేంద్రానికి నోటీసులిస్తే, కేంద్రం మాకు సంబంధం లేదు అని కౌంటర్ వేసినట్టుగా అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది అది కాదు. 2018లో గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదాకు సంబంధించి, రాష్ట్ర రాజధాని నిధులకు సంబంధించి, ఇంకా ఇతరత్రా కొన్ని ఇనిస్టిట్యూట్లకు సంబంధించి అన్నింటినీ కలిపి శ్రీనివాసరావు అనే ఓ రైతు 2018లో కోర్టులో వేసిన పిటిషన్ ఇది. రెండు సంవత్సరాల తర్వాత కోర్టు అడిగితే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దాంట్లో మిగతా అంశాలన్నింటిని వెనక్కు నెట్టేసి రాజధానితో మాకు సంబంధం లేదు అనేదాన్ని హైలెట్ చేస్తూ ఆ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. ఇప్పుడు కేంద్రమే ప్రమాణ పత్రం దాఖలు చేసింది కదా?. మాకు సంబంధంలేదని, ఇంకేం చేస్తారు?.అందరూ ఇక సైలెంట్ అయిపోండని అందరూ చెప్పే మాట ఇది. కేంద్రం అది చెప్పిందా?. అసలు కేంద్రం అలా చెప్పొచ్చా?.  ఇవన్నీ చాలా అంశాలున్నాయి. ప్రమాణ పత్రంలో కూడా చాలా లొసుగులున్నాయి. ఇందులో రాజధాని అంశాన్ని క్లియర్‌గా చెప్పిందా?. పోనీ రాజధానికి సంబంధించిన రూ.2500 కోట్ల అంశాన్ని ఈ కౌంటర్ అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదు కేంద్రం. ప్రమాణ పత్రంలో 2500 కోట్లు ఇచ్చామనే అంశం లేదు. ఇవన్నీ దాచేసి కేంద్రం తప్పటడుగులు వేసింది. అసలు పిటిషన్ వేసిన అడ్వకేట్ పీవీ కృష్ణయ్యతో పాటు పలు పార్టీల నేతలతో ఏబీన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌లో వీపీ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు చెందిన రైతు శ్రీనివాసరావు 25 నెలల క్రితం ఈ పిటిషన్ వేశారన్నారు. 

Updated Date - 2020-08-07T01:46:27+05:30 IST