కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త!

ABN , First Publish Date - 2021-10-21T21:48:22+05:30 IST

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త!

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), పింఛనుదారులకు డియర్‌నెస్ రిలీఫ్ 3 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో డీఏ 31 శాతానికి చేరుతుంది. ఈ నిర్ణయం వల్ల 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందుతారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్  గురువారం చెప్పారు. 


కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వోద్యోగులకు డీఏ, పింఛనుదారులకు డియర్‌నెస్ రిలీఫ్ 3 శాతం పెంచినట్లు తెలిపారు. డీఏ 28 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందన్నారు. 2021 జూలై 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు దీని వల్ల ప్రయోజనం పొందుతారని, ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.9,488 కోట్లు భారం పడుతుందని చెప్పారు. 


కోవిడ్-19 మహమ్మారి సమయంలో పేదలకు 15 నెలలపాటు రేషన్ సరుకులను అందజేసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదుకున్నారని చెప్పారు. రుణాలపై మారటోరియంను పెంచారన్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక చర్యలు తీసుకోవడంతోపాటు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. 



Updated Date - 2021-10-21T21:48:22+05:30 IST