Abn logo
Apr 10 2020 @ 13:33PM

థియేట‌ర్స్‌, మాల్స్‌కు కేంద్రం షాక్ ఇవ్వ‌నుందా?

కోవిడ్ 19 ప్ర‌భావంతో ప్ర‌పంచ వ‌ణికిపోతోంది. అంత లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ప‌లు రంగాలు స్తంభించాయి. సినిమా ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌స్తే థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. ఏప్రిల్ రెండో వారం త‌ర్వాత లాక్‌డౌన్ క్లియ‌ర్ అవుతుంద‌ని అనుకున్నారు. కానీ మ‌రో రెండు వారాల పాటు లాక్‌డౌన్ కొన‌సాగే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. అంటే ఒక‌వేళ ఏప్రిల్ చివ‌రి వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగితే సినిమా థియేట‌ర్స్ ప‌రిస్థితేంటి?  సినిమాల‌ను ఎప్పుడు? ఎలా విడుద‌ల చేసుకోవాలి? అంటూ నిర్మాత‌లు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఒకవేళ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ త‌ర్వాత ఎత్తేసినా! ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు రావాలంటే ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. మాల్స్‌లో ఎక్కువ మంది గుంపులుగా చేరుతారు. అలా చేర‌డం మంచిది కాదు. కాబ‌ట్టి ప్ర‌భుత్వం థియేట‌ర్స్‌, మాల్స్‌ను వెంట‌నే ఓపెన్ చేయాల‌నుకోవ‌డం లేదని, జూన్ చివ‌రి వ‌ర‌కు థియేటర్స్‌, మాల్స్ మూత ప‌డే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి థియేట‌ర్స్, మాల్స్‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నాయో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement