Abn logo
Sep 26 2021 @ 23:28PM

రైతులను నట్టేట ముంచిన కేంద్ర ప్రభుత్వం

సమావేశంలో మాట్లాడుతున్న మనోసాగర్‌రెడ్డి

రైతు జాగృతి సంఘం జిల్లా అధ్యక్షుడు 


కడప (మారుతీనగర్‌), సెప్టెంబరు 26 : రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలను తెచ్చి నట్టేట ముంచిందని రైతు జాగృతి సంఘం జిల్లా అధ్యక్షుడు జి.మనోసాగర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతన్నల నోట్లో మట్టికొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలను తీసుకొచ్చిందన్నా రు. ఇందుకు వ్యతిరేకంగా సంవత్సర నుంచి రైతులు పోరాటం చేస్తున్నా చీమకుట్టినట్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. ఇందుకు నిరసనగా ఈనెల 27న సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో తలపెట్టిన భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  సమావేశంలో ఆ సంఘం ఉపాధ్యక్షుడు జి.సురే్‌షకుమార్‌రెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.