‘కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’

ABN , First Publish Date - 2020-07-15T11:39:12+05:30 IST

వేలాది మందికి ఉపాధి కల్పించిన సీసీఐ మూతబ డి ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీసీఐ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా

‘కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’

ఆదిలాబాద్‌టౌన్‌, జూలై14: వేలాది మందికి ఉపాధి కల్పించిన సీసీఐ మూతబ డి ఏళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీసీఐ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విలాస్‌ ఆ రోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా గేటు వద్ద యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడు తూ.. పరిశ్రమను, కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని అనేకమార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. యూనియన్‌ ఇంత వర కు ఫ్యాక్టరీని నడిపించడానికి ప్రయత్నం చేసిందని, దీనికి హైకోర్టులో రాష్ట్ర ప్రభు త్వం సహకరించిందని అన్నారు. కేంద్రంతో మాట్లాడి సీసీఐని తెరిపిస్తామని భరో సా కల్పించారని, కేంద్ర ప్రభుత్వమే సహకరించడం లేదని ఆరోపించారు. ఈ కార్య క్రమంలో రాజన్న, ఆర్‌కే ఘోష్‌, స్వామి, అంజయ్య, అంబ్బల జనార్దన్‌, ఎల్‌.శ్రీరాం, హెచ్‌ఎన్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-15T11:39:12+05:30 IST