తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష

ABN , First Publish Date - 2022-05-16T06:28:46+05:30 IST

Central government discriminates against Telangana

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

- టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌

గోదావరిఖని, మే 15: కేంద్ర ప్రభుత్వం తెలంగా ణ రాష్ట్రంపై వివక్షత చూపుతోందని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆరోపించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందరో అమరుల ఆత్మబలిదానం, కేసీఆర్‌ సంకల్ప దీక్షతో ఆవిర్భవించిందన్నారు. ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి పనులు చేసి దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో ప్రజలకు పచ్చి అబద్దాలు చెప్పారని, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు బండి సంజయ్‌ ప్రచారాలు నమ్మరని, విభజన చట్టంలో తెలంగాణకు పార్లమెంట్‌ సాక్షిగా అనేక హామీలు ఇచ్చినా ఒక్క హామి కూడా నెరవేరలేదని, నరేంద్రమోదీ గుజరాత్‌కో నీతి, తెలంగాణకో నీతి అన్నట్టు వ్యవహరిస్తున్నారని, కాజిపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి దశాబ్దాలు గడిచినా తెలంగాణకు మొండి చేయి చూపి రూ.20వేల కోట్లతో గుజరాత్‌లో కోచ్‌ ఫ్యాక్టరీని పెట్టాలని నిర్ణయం తీసుకోవడం, తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న చిన్న చూపునకు నిదర్శనమన్నారు. దేశంలో 28రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అనేక ప్రజా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో తొమ్మిది మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. విలేకరుల సమావేశంలో మేయర్‌ బంగి అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T06:28:46+05:30 IST