కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని విడనాడాలి

ABN , First Publish Date - 2020-12-06T04:24:31+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రైతులపై నిరంకుశంగా వ్యవహరించడం విడనాడాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు లాల్‌కుమార్‌, పి. శ్రీనివాస్‌, రామడుగు లక్ష్మణ్‌, ఖలీందర్‌ అలీఖాన్‌లు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని విడనాడాలి
దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వామపక్ష పార్టీ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 5: కేంద్ర ప్రభుత్వం రైతులపై నిరంకుశంగా వ్యవహరించడం విడనాడాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు లాల్‌కుమార్‌, పి. శ్రీనివాస్‌, రామడుగు లక్ష్మణ్‌, ఖలీందర్‌ అలీఖాన్‌లు పేర్కొన్నారు. శనివారం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బస్టాండ్‌ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం హర్యానా, ఢిల్లీ సరిహ ద్దులను మూసివేయడం, రైతులపై భాష్పవాయువులతో విరుచుకుపడటం సిగ్గు మాలిన చర్య అన్నారు. రైతుల హక్కులను హరించి వ్యవసాయ రంగాన్ని కార్పొ రేట్‌ కంపెనీలకు కట్టబెట్టే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రత్నం తిరుపతి, సురేందర్‌, శ్రీకాంత్‌, ప్రవీణ్‌, పోశన్న, సంకె రవి, రాజేశ్వరి పాల్గొన్నారు. 


రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శన 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో  ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అధ్యక్ష, కార్యదర్శులు తిరుపతిరెడ్డి, రాందాస్‌లు మాట్లాడుతూ కార్పొరేట్ల లాభాల కోసమే ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందన్నారు. ఆర్‌.రాజేశం,  శివరం జన్‌, శ్రీనివాస్‌, రవీందర్‌, రాకేష్‌, సోని, సౌమ్య, శైలజ,  మౌనిక పాల్గొన్నారు. 


కేంద్ర ప్రభుత్వ చట్టాలతో రైతులకు ద్రోహం

కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలతో రైతులకు ద్రో హం తలపెడుతోందని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ (ఐఆర్‌సీపీ) రాష్ట్ర కార్య దర్శి కె.జయరావు, బికెఎస్‌ఎస్‌ (భారత కిసాన్‌ సంగ్రామ్‌ సమితి) రాష్ట్ర  కన్వీనర్‌ నైనాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు ని రసనగా ఏసీసీ చౌరస్తాలో రైతులతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. వ్య వసాయ సవరణ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. శ్రీను, లింగమూర్తి, కృష్ణ, సమ్మయ్య, రాజబాబు, మల్లయ్య, శంకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T04:24:31+05:30 IST