Abn logo
Mar 27 2020 @ 02:52AM

కార్మికులు, రైతులకు కేంద్రం కేటాయింపులపై హర్షం

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావంతో ఇబ్బంది పడుతోన్న కార్మికుల ఆకలి తీర్చేందుకు రూ.1.70 లక్షల కోట్లు కేటాయించడం , అందులో రూ.31 వేల కోట్లు కేవలం అసంఘటిత రంగ కార్మికుల కోసమే కేటాయించడం చరిత్రలో లిఖించదగిన  విషయమని కేంద్ర కార్మిక బోర్డు చైర్మన్‌ జయప్రకాశ్‌ నారాయణ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.  రైతులకు రూ.2000 ఇచ్చి ఆదుకున్న ప్రధానికి కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ రాజు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేశ్‌ నాయుడు, ఎస్‌సీ మోర్చా నేత గంగాధర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement