దుబ్బాక ఉపఎన్నికలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాలి: డీకే అరుణ

ABN , First Publish Date - 2020-10-26T22:38:30+05:30 IST

దుబ్బాక ఉపఎన్నికలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాలి: డీకే అరుణ

దుబ్బాక ఉపఎన్నికలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాలి: డీకే అరుణ

హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవాలని బీజేపీ నాయకురాలు డీకే అరుణ కోరారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు బంధువుల ఇళ్ళలో సోదాలను ఖండిస్తున్నామని ప్రకటించారు. వేల కోట్లున్న టీఆర్ఎస్ నేతలను వదిలి.. బీజేపీ నేతల ఇళ్లపై పడటం సిగ్గుచేటన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్‌ గెలుపు బాధ్యతలను పోలీసులకు అప్పగించారా? అని అరుణ ప్రశ్నించారు. పోలీసులు పోస్టింగుల కోసం టీఆర్ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్వేలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రావడాన్ని మంత్రి హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్‌ను ఓడించి దుబ్బాక ప్రజలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలవనున్నారని డీకే అరుణ కొనియాడారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇళ్లలో, కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సిద్దిపేటలో రఘునందన్‌రావు అత్తారిల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు.

Updated Date - 2020-10-26T22:38:30+05:30 IST