IPL2022 :నేరుగా సెంట్రల్ కాంట్రాక్ట్.. ఉమ్రాన్ మాలిక్‌పై మాజీ దిగ్గజం ప్రశంసలు

ABN , First Publish Date - 2022-05-18T23:24:50+05:30 IST

ముంబై : సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) నయా సంచలనం.. 22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్‌ను ప్రశంసిస్తున్నవారి జాబితా రోజురోజుకూ పెరుగుతోంది.

IPL2022 :నేరుగా సెంట్రల్ కాంట్రాక్ట్.. ఉమ్రాన్ మాలిక్‌పై మాజీ దిగ్గజం ప్రశంసలు

ముంబై : సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) నయా సంచలనం.. 22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్‌ను ప్రశంసిస్తున్నవారి జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. గరిష్ఠంగా గంటకు 157 కిలోమీటర్ల వేగంతో ఈ స్పీడ్‌స్టార్  సంధిస్తున్న బంతులు క్రికెట్ ఫ్యాన్స్ నుంచి మాజీ క్రికెటర్ల దాకా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. IPL2022 సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 21 వికెట్లు తీశాడు. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లో కేవలం 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. హైదరాబాద్ విజయంలో అత్యంత కీలకపాత్ర పోషించాడు. క్రమంగా మెరుగుపడుతున్న ఉమ్రాన్ మాలిక్‌.. మాజీ ఇండియన్ కోచ్ రవిశాస్త్రి దృష్టిని కూడా ఆకర్షించాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో టైమ్-ఔట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.


‘‘ ఉమ్రాన్ మాలిక్‌‌కు నేరుగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టే. అతడిని ఇలాగే వదిలేయొద్దు. ప్రధాన ఆటగాళ్లతో జతకలుపుతూ ఉండాలి. షమీ, బుమ్రా వంటి ఆటగాళ్ల పక్కన తిరిగుతుంటే వారు శిక్షణ పొందుతున్న విధానం, ఒత్తిడిని ఏవిధంగా ఎదుర్కొంటారనే విషయాలను గమనిస్తూ నేర్చుకుంటాడు. టీమ్ మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్ ఉండనే ఉంటారు. కాబట్టి ఉమ్రాన్ మాలిక్ దారితప్పడు. ఆటగాళ్లతో ఉంచుతుండండి’’ అని రవిశాస్త్రి సూచనలు చేశాడు. 


ఉమ్రాన్ మాలిక్ మరింత మెరుగవుతాడని రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. అతడి బౌలింగ్ గమనిస్తే.. ఒక్క వికెట్ తీశాడంటే చక్కటి లైన్ అందుకుంటాడు. బ్యాట్స్‌మెన్స్‌ను బెంబేలెత్తిస్తాడు. అయితే వికెట్ పడకపోతే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇబ్బంది పడుతున్నాడు. అలాగని వేగం తగ్గించుకోవాలని మాత్రం అతడికి చెప్పొద్దు. తొలుత మూడు వికెట్లనే టార్గెట్ చేయమని చెప్పాడు. ఆ తర్వాత ఎలాంటి నైపుణ్యాలు అవసరమో అవి నేర్పాలి. సరైన లైన్స్‌లో బౌలింగ్ చేయమని చెప్పాలని శాస్త్రి సూచించాడు. లెంగ్త్‌‌లో మార్పులు చేయగలిగితే ఎలాంటి బ్యాట్స్‌మెన్నైనా ఉమ్రాన్ మాలిక్ ఇబ్బంది పెట్టగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. బౌలింగ్ వేగం తగ్గించుకోకుండా వేరియేషన్స్ చూపించగలిగితే చాలా మెరుగవుతాడని విశ్లేషించాడు. రెడ్ బాల్ క్రికెట్‌(టెస్టులు)ల్లోకి కూడా మాలిక్ అడుగుపెట్టగలడని రవిశాస్త్రి విశ్వాసం వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-05-18T23:24:50+05:30 IST