సెంట్రల్‌ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-05-25T15:52:39+05:30 IST

అత్తాపూర్‌ పిల్లర్‌ నెంబర్‌ 125 వద్ద గల సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భవనంలో సోమవారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది

సెంట్రల్‌ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

షార్ట్‌ సర్క్యూటే కారణం 

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: అత్తాపూర్‌ పిల్లర్‌ నెంబర్‌ 125 వద్ద గల సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా భవనంలో సోమవారం రాత్రి షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన స్థానికులు ఫైర్‌ స్టేషన్‌తో పాటు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. రెండు ఫైరింజన్‌లు వచ్చి మంటలను ఆర్పేశాయి. మంటలను ఆర్పడానికి రెండు ఎక్స్‌కవేటర్ల సహకారంతో కిటికీలను పగులగొట్టారు. మూడు గంటల పాటు శ్రమించి ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పారు. లాకర్లు ఉన్న  ప్రాంతానికి మంటలు వ్యాపించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంకులోని ఫర్నిచర్‌, కంప్యూటర్లు, యూపీఎ్‌సలు కాలిపోవడంతో రూ. 15.25 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బ్యాంక్‌ మేనేజర్‌ రాజారావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంటలను ఆర్పడంలో చొరవ చూపిన ఫైర్‌ సిబ్బందిని, పోలీసులను స్థానికులు అభినందించారు. 

Updated Date - 2022-05-25T15:52:39+05:30 IST