జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ తోడు దొంగలేనని, ఆ తోడు దొంగల ఆటలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ధర్నాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఆదాయం కోసం ధరలు పెంచడమొక్కడే మార్గమా?.. విదేశాల్లోని నల్లధనం తీసుకురావొచ్చుగా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ పన్నులపై రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్న రూ. 12వేల కోట్ల బకాయిలు చెల్లించి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. పెంచిన ధరల తగ్గింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం అవుతోందని జీవన్‌రెడ్డి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి