రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-06-26T05:05:24+05:30 IST

అబద్ధపు వాగ్ధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ అన్నారు.

రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న హరికృష్ణ

  టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ


నారాయణరావుపేట, జూన్‌ 25: అబద్ధపు వాగ్ధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ అన్నారు. శనివారం నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసేది కాంగ్రెస్‌ పార్టీయేనని, పంటలకు సరైన మద్దతు ధర కాంగ్రె్‌సతోనే సాధ్యమవుతుందని చెప్పారు. రైతులను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే రూ.రెండు లక్షల రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేస్తుందని హామీ ఇచ్చారు. వారి ఆస్తులను భద్రం చేసుకునేందుకే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తెచ్చిందని, కాంగ్రెస్‌ దానిని రద్దు చేసి సరికొత్త రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గుర్రం అంజిరెడ్డి, ఫిషరిష్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి గౌటి బాబేష్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు నాంపల్లి కనకయ్య, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బింగి యాదగిరి, నాయకులు రాజేశంగౌడ్‌, రమేష్‌, కనకయ్య, బిట్ల శ్రీనివాస్‌, దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.


రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే విడుదల చేయాలి


సిద్దిపేట రూరల్‌, జూన్‌ 25: మండలంలోని పుల్లూరు గ్రామంలో శనివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ధాన్యం డబ్బులు వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సూర్యవర్మ డిమాండ్‌ చేశారు. రైతు డిక్లరేషన్‌ కరపత్రాలను పంపిణీ చేశారు. అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ.12వేల ఆర్థిక సహాయం, కౌలు రైతులకు రూ.15వేల పెట్టుబడి సహాయం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్‌ మండలాధ్యక్షుడు గరిపల్లి వెంకట్‌, నాయకులు కనకరెడ్డి, శ్రీనివాస్‌, లింగం, వినయ్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-06-26T05:05:24+05:30 IST