ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2022-05-21T06:30:07+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం ఆర్యవైశ్య భవనంలో కాంగ్రెస్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. 60 మంది ముస్లింలు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు
సమావే శంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రుద్రంగి మే 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం ఆర్యవైశ్య భవనంలో కాంగ్రెస్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. 60 మంది ముస్లింలు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ సమక్షంలో పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవర్‌రెడ్డి మాట్లాడుతూ 2014లో కాంగ్రెస్‌ హయాంలో   పెట్రోల్‌, డిజీల్‌, వంటగ్యాస్‌ ధరలు ఉన్నాయో? కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పెట్రోల్‌, డిజీల్‌, వంటగ్యాస్‌పై రాయితీ కల్పిస్తామని,  సామాన్యులకు అందుబాటు ఉండే విధంగా ధరలు ఉంటాయని అన్నారు. అధికారంలోకి వస్తే ధాన్యానికి   రూ.2500 మద్దతు ధర చెల్లిస్తామన్నారు.  ఏకకాలంలో రుణ మాఫీ చేయనున్నట్లు చెప్పారు. నాలుగేళ్ల క్రితం ఎన్నికల సమయంలో సూరమ్మ చెరువు పనులకు  మంత్రి హరీష్‌రావు  శంకుస్ధాపన చేసిన వదిలేశారని,  కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో సూరమ్మ చెరువును పూర్తి చేస్తామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో గర్ల్స్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌లో భాగంగా భాలికకు రెండు లక్షలు ఇచ్చేవారని దాని పేరు మార్చి కల్యాణ లక్ష్మి అని పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అనంతరం ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ డిక్లరేషన్‌లో ప్రకటించిన తొమ్మిది ప్రకటనలతో రైతులకు మేలు జరుగుతుందన్నారు సర్పంచ్‌ తర్రె ప్రభలత మనోమర్‌,  కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య, గ్రామ అధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, తర్రె మనోహర్‌, చెలుకల తిరుపతి, పొద్దుపొడుపు లింగారెడ్డి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి,  మహిపాల్‌, సాదుల్లా, బాషా, ఎర్రం గంగనర్సయ్య, జావిద్‌, సయ్యద్‌, ఉస్మాన్‌, సాదుల్లా, జమాల్‌, సలీమ్‌, సల్మాన్‌ తర్రె లింగం, గండి నారాయణ, పల్లి గంగాధర్‌, సూర యాదయ్య, మాడిశెట్టి అభిలాష్‌, ఎర్రం సత్తయ్య, అరవింద్‌, రవి, దాసు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:30:07+05:30 IST