ధరల నియంత్రణలో ప్రభుత్వాల విఫలం

ABN , First Publish Date - 2022-05-25T05:21:44+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలం చెందాయని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, సీపీఐ నేత రామరాజు, సీపీఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి లక్ష్మీరెడ్డి మాట్లాడారు.

ధరల నియంత్రణలో ప్రభుత్వాల విఫలం
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న వామపక్ష నేతలు

30న కలెక్టర్‌ వద్ద ధర్నా

వామపక్ష ఐక్య వేదిక నాయకులు

నెల్లూరు(వైద్యం) మే 24 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలం చెందాయని వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, సీపీఐ నేత రామరాజు, సీపీఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి లక్ష్మీరెడ్డి మాట్లాడారు. దేశంలోని 10 వామపక్షాల పిలుపు మేరకు ఈ నెల 30న కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్‌, నిత్యావసర సరుకుల ధరలు పెంచటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి, చెత్త పన్ను వంటి పన్నులతో ప్రజలపై  ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటుంటోందన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ఆందోళనకు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. అనంతరం ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యూడెమొక్రసీ నేత రాంబాబు, సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ నేత షాన్‌వాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:21:44+05:30 IST