Centipede: ఇడ్లీలో జెర్రీ.. మహిళ వాంతులు..

ABN , First Publish Date - 2022-07-19T21:26:50+05:30 IST

ఇది చైనా కాదు.. అయినా ఇక్కడ ఫ్రీగా విషపు పురుగులను అన్నింట్లో వేసి అమ్ముతున్నట్లు ఉంది.

Centipede: ఇడ్లీలో జెర్రీ.. మహిళ వాంతులు..

పెద్దపల్లి జిల్లా (Peddapally district): ఇది చైనా (China) కాదు.. అయినా ఇక్కడ ఫ్రీగా విషపు పురుగులను అన్నింట్లో వేసి అమ్ముతున్నట్లు ఉంది. పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్‌లోని ఓ టిఫిన్ సెంటర్ (Tiffin center) యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇడ్లీ (Idly)లో జెర్రీ (Centipede) రావడంతో ఓ మహిళ (women) వాంతులు (vomiting) చేసుకుంది. కూరగాయలు అమ్ముతున్న మహిళ రమా స్థానికంగా ఓ టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీలు పార్శిల్ తెప్పించుకుని మూడు ఇడ్లీలు తిన్న తర్వాత నాలుగో ఇడ్లీ తింటున్న సమయంలో అందులో నల్లటి జెర్రీ ప్రత్యక్షం కావడంతో ఆమె ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. జెర్రీని చూడగానే వాంతులు చేసుకుంది. దీంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో సంబంధిత ఫుడ్ సేప్టీ అధికారులు, స్థానిక మున్సిపల్ అధికారుల నిఘా కొరవడడంతోనే టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తున్నారని, ఇలాంటి దారుణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇడ్లీలో జెర్రీ దృశ్యం ఇప్పుడు వీపరీతంగా వైరల్ అవుతోంది.

Updated Date - 2022-07-19T21:26:50+05:30 IST