Abn logo
Jun 20 2021 @ 14:23PM

హైదరాబాద్‌లో కేంద్రం వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి: కేటీఆర్‌

హైదరాబాద్: హైదరాబాద్‌లో కేంద్రం వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిన హైదరాబాద్‌లో టెస్టింగ్ సెంటర్ అత్యవసరమన్నారు. ఇక్కడే టెస్టింగ్ సెంటర్‌ ఏర్పాటు చేస్తే నెలకి 10 కోట్ల డోసులు అదనంగా ఉత్పత్తి చేస్తామని తెలిపారు. టెస్టింగ్ సెంటర్‌కు అవసరమైన భూమిని జీనోమ్ వ్యాలీలో ఇస్తామని, టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్‌ చెప్పారు.